ELR: ఉంగుటూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇవాళ ఏపీ రైతు సంఘం నాయకులు పర్యటించారు. కల్లాలోని ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయకుండా 75 కేజీల చొప్పున ఎకరాకు 56 బస్తాలు కొనుగోలుకు 105 గోనె సంచులు ఇవ్వడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.