TG: మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ది రెండు నాల్కల ధోరణి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు మహిళా వ్యతిరేకులు అని విమర్శించారు. డీలిమిటేషన్లో 50 శాతం సీట్లు పెంచుతామని అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి చెప్పామన్నారు. అన్ని పార్టీలకు ఇదే వివరించామన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో విపక్షాలు ప్రజలకు చెప్పలేకపోయాయన్నారు.