PPM: గ్రామాల పారిశుద్ధ్య పనులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శనివారం పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ద్వారా పంచాయితీలకు మంజూరైన ట్రై సైకిళ్లు, పుష్ కార్డ్లు, డస్ట్ బిన్ల పంపిణీతో పాటు, గ్రామాలలో వ్యర్ధాలను సేకరించి వాటికి గృహావసర వస్తువులు కొనుగోలు చేసే స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు.