WGL: గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు 2026 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి పి.అపర్ణ మంగళవారం తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు అర్హత కలిగిన పదో తరగతి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రవేశ పరీక్ష మే 15న నిర్వహించినట్లు తెలిపారు.