HYD: చర్లపల్లి పరిధిలోని సిపెట్ కాలేజ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్ల సురేంద్ర (32) అనే వ్యక్తి మృతి చెందారు. జూపిటర్ బైక్పై వెళ్తున్న సురేంద్రను, సురానా ఎక్స్ రోడ్ నుంచి అతివేగంగా వచ్చిన పల్సర్ బైక్ బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.