NLG: చిట్యాల పట్టణంలోని ముత్యాలమ్మ గూడెం యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఏర్పుల స్వామి యాదవ్, కార్యదర్శిగా చింతపల్లి ప్రవీణ్ యాదవ్, కోశాధికారిగా మద్ది మధు యాదవ్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. యాదవుల సమస్యల పరిష్కారానికి, సంఘం బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.