ఇంటర్ ఫలితాల సందర్భంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కొత్త పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించాలని విద్యాశాఖ సన్నాహాలు చేసినా.. దానికి బ్రేక్ పడినట్లు సమాచారం. వాస్తవానికి గత విద్యాసంవత్సరంలోనే సిలబస్ మార్చాలని చూసినా.. చివరి నిమిషంలో పుస్తకాల ముద్రణకు సమయం సరిపోదని ఈ ఏడాదికి వాయిదా వేసింది. అయితే ఈ ఏడాది కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది.