మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న ‘ఇరుముడి’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి శోభన ఒక కీలక ఎమోషనల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. రవితేజ, శోభన మధ్య ఉండే బాండింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నట్లు టాక్. ఇక ఇందులో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా, బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు.