నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కాంబోలో మరో భారీ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ చెప్పిన చారిత్రక, ఎమోషనల్ కథ బాలయ్యకు బాగా నచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.