NZB: రహదారులపై ధాన్యం ఆరబెట్టే రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామని నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ హెచ్చరించారు. వడ్ల వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు జైలు శిక్ష, జరిమానా తప్పదని స్పష్టం చేశారు. రైతులు రోడ్లకు బదులు ప్రత్యామ్నాయ ప్రదేశాల్లోనే ధాన్యం ఆరబోసుకోవాలని ఆయన సూచించారు.