BHNG: ఎం.తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో సాగునీరు అందక పంటలు ఎండిపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం రాస్తారోకో చేపట్టారు. చెరువులు అడుగంటి ప్రాణాలు పోతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి జలకళ తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. స్పందించకుంటే ఉద్యమాన్ని జిల్లావ్యాప్తంగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.