AP: కేసులకు భయపడేవాళ్లు వైసీపీలో లేరని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అంబటి రాంబాబు, పిన్నెల్లి, జోగి రమేష్‌ను సంబంధం లేని కేసుల్లో జైళ్లకు పంపినా వాళ్లు భయపడలేదన్నారు. తాను ఎప్పుడూ లిక్కర్ వ్యాపారం చేయలేదని, లిక్కర్ స్కామ్ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందన్నారు. వైసీపీ నుంచి కొందరు బ్యాడ్ క్యారెక్టర్స్ వెళ్లిపోయారని, పార్టీ ఇప్పుడు ఫిల్టర్ అయిందని వెల్లడించారు.