ASF: జిల్లాలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్‌పై వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ హరిత మంగళవారం ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. మహనీయుల జీవితాలు విద్యార్థులకు ఆదర్శమని తెలిపారు. విద్యార్థులు ఇలాంటి పోటీల్లో పాల్గొని ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు.