PDPL: కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ పెద్దపల్లి పట్టణంలోని కమాన్ ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఏరియాను డీసీపీ రామ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్స్, స్పీడు లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు.