MNCL: రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చేయూత అందిస్తుందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం చెన్నూర్‌లోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి హాజరయ్యారు. కుట్టు శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి పొంది కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.