ADB: రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని SP అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలపై సంబంధిత పోలీసు అధికారులు ప్రజలతో కలిసి పాల్గొని భద్రత ప్రతిజ్ఞను చేయించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.