BPT: అద్దంకిలోని మెప్మా కార్యాలయంలో శనివారం అక్షర-ఆంధ్ర ఉల్లాస్ పథకం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆర్పీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అక్షర-ఆంధ్ర కన్వీనర్ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ.. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అభ్యాసకుల నమోదు చేపట్టిందన్నారు.