NRPT: నారాయణ పేట మండలం లక్ష్మీపూర్‌లో మంగళవారం ఓ ఇంటిపై దాడి చేసి అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు సబేరాబేగం ఇంటిపై దాడి చేసి 10.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆమె పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.