MBNR: జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విద్యార్థినిలను, అధ్యాపక బృందాన్ని అభినందించారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.