GDWL: జిల్లా చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేనేత కార్మికులు ఎదురుచూస్తున్న చేనేత భరోసా పథకం ఈ నెల 16న గద్వాలలోని అనంత కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ప్రారంభించనున్నట్లు ఏడీవో బాలకృష్ణ తెలిపారు. చేనేత రుణమాఫీ, చేనేత భరోసా, చేనేత భీమా పథకాలకు సంబంధించిన చెక్కులను గురువారం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పంపిణీ చేయనున్నారు.