నల్గొండ జిల్లాలో వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. గ్యాస్ దొరక్క హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తుండగా, ఇడ్లీ, దోశల ధరలు రూ. 10 వరకు పెరిగాయి. మరోవైపు గృహ వినియోగ సిలిండర్ల సరఫరాలోనూ జాప్యం జరుగుతోంది. బ్లాక్ మార్కెట్ దందాతో ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.