ADB: బజార్హత్నూర్ మండలంలోని వార్తమన్నూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఆదిలాబాద్ MP గోడం నగేశ్ ను ఆయన నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులను కల్పించాలని ఎంపీతో విన్నవించగా సానుకూలంగా స్పందించినట్లు గ్రామ సర్పంచ్ సిడం ప్రకాష్ పేర్కొన్నారు. వీరితో పాటు నాయకులు గంగాధర్ రావు, గుణవంతు రావ్, తదితరులు ఉన్నారు.