PDPL: రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని గోకుల్ నగర్ నాటు కోళ్ల అనుమానాస్పద మృతి స్థానికంగా ఆందోళన కలిగించింది. శ్రీకాంత్‌కు చెందిన కోళ్లు ఒక్కసారిగా చనిపోవడంతో, గుర్తు తెలియని వ్యక్తులు విషపూరిత ఆహారం ఇచ్చి చంపినట్లు బాధితుడు ఆరోపించారు. వ్యక్తిగత వైరం కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరపాలని గ్రామస్తులు కోరుతున్నారు.