బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ విష్ణుప్రియ భీమినేనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్‌స్టాలో అసభ్యకర ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నారని AISF నేతలు ఫిర్యాదు చేశారు. సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూలు చేయడం నేరమని, వెంటనే ఆమె అకౌంట్‌ను బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.