MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో కొబ్బరికాయలు,పూజా సామాగ్రి విక్రయించే లైసెన్స్ హక్కుల కోసం ఈనెల 13న (సోమవారం) బహిరంగ వేలం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఈ ప్రక్రియ జరుగుతుందని EO బాపిరెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.