TG: డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని అడ్డుకునేందుకు ఐక్యంగా పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఢిల్లీలో జరగనున్న ఇండీ (I.N.D.I.A) కూటమి భేటీకి హాజరుకానున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించడమే లక్ష్యంగా విపక్ష నేతలతో చర్చలు జరుపుతారు. దక్షిణ రాష్ట్రాల కోటాను తగ్గించే ఏ లెక్కనైనా అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.