KMM: కొణిజర్ల(M)వెంకటాపురం శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఎస్సై సూరజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రైడ్ చేయగా ఆరుగురు పట్టుబడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యారు. నిందితుల వద్ద నుంచి రూ.20 వేల నగదుతో పాటు ఒకమోటార్ సైకిల్, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.