SRD: ఎండాకాలం ప్రజల దాహార్తి తీర్చేందుకు కాలనీవాసులు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని నారాయణఖేడ్ మున్సిపల్ ఛైర్మన్ నాగేష్ శెట్కార్ అన్నారు. పట్టణం పరిధిలోని శ్రీ సత్యనారాయణ స్వామి మందిరం కాలనీ వాసులు ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇందులో కౌన్సిలర్లు ఉన్నారు.