JN: ప్రజాపాలన-ప్రగతి పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోలీసులు జనగామ-బచ్చన్నపేట రోడ్డులో ప్రమాదకర గుంతలను పూడ్చివేశారు. చంపక్ హిల్స్ సమీపంలోని ఎంసీహెచ్ ఆసుపత్రి వద్ద ఉన్న గుంతలను బిటుమెన్తో మరమ్మతు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేందర్ నాయక్, ఏసీపీ పండరీ చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సైలు భరత్, రథీష్, పాల్గొన్నారు.