E.G: గనులు & భూగర్భ శాఖ, రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ అధికారుల బృందం మంగళవారం తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా గనులు & భూగర్భ అధికారి డి.ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు. కాతేరు సమీపంలో అక్రమంగా నిలిపి ఉంచిన రెండు డ్రెడ్జింగ్ పడవలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. బ్రిడ్జిలకు ఇరువైపులా 500 మీటర్ల పరిధిలో ఇసుక తవ్వకాలు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.