MBNR: అడ్డాకుల మండలం కందూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం చారిత్రక ప్రాశస్త్యం కలిగి ఉంది. 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ శైవ క్షేత్రం, చోళుల ప్రభావం ఉన్న ప్రాంతంలో వెలసింది. అద్భుత నిర్మాణ శైలితో భక్తులను ఆకట్టుకుంటూ దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందింది. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.