KMM: తల్లాడ మండలంలోని నరసింహరావుపేట వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఐ మండల కార్యదర్శి ఓర్సు రమేష్ మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేష్ మృతితో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సంతాపం వ్యక్తం చేశాడు.