PDPL: రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని ఎలిగేడు ఎస్సై మధుకర్ అన్నారు. ఎలిగేడు మండల కేంద్రంలో ఎస్సై మధుకర్ ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలన్నారు.