VKB: బషీరాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈ స్టేషన్లో హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదలకు అనుమతి లభించినప్పటికీ, ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే విషయంలో రైల్వే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.