MBNR: ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా భూత్పూర్ మండలంలో షేరీ సత్యం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. పోటీల్లో శేరిపల్లి హెచ్ గ్రామం జట్టు ప్రథమ బహుమతి గెలుచుకుంది. ముఖ్య అతిథులుగా నరేశ్ చారి, చంద్రశేఖర్, అన్వర్, కృష్ణయ్య పాల్గొన్నారు. క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యమని వారు తెలిపారు.