PDPL: జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరిగే ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షలకు 11 కేంద్రాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శారద ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పని చేసి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు కల్పించాలని తెలిపారు.