MLG: జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జిల్లాలో పలుచోట్ల అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ దివాకర్ టీఎస్ అగ్ని నివారణ పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించి, భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. 1944 ముంబాయి డాక్ యార్డు అగ్ని ప్రమాదంలో మృతి చెందిన సిబ్బందిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.