AP: మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుపై నెట్టింట అభ్యంతరకర పోస్టులు పెట్టించారనే ఆరోపణలపై చిత్తూరులో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు.