KNR: గన్నేరువరం మండలం జంగపల్లికి చెందిన ఖాత లక్ష్మయ్య (50) అదృశ్యమయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 8న ఇంటి నుంచి వెళ్లిన ఆయన ఇప్పటివరకు తిరిగి రాలేదని భార్య పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.