MBNR: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్నగర్ మండలం రామచంద్రపురం సమీపంలో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముతుండగా మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.