MDK: మల్కాపూర్, గుండ్రెడ్డిపల్లి, తూప్రాన్ పెద్ద చెరువులను జిల్లా ఫారెస్ట్ అధికారి జోజి పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెరువుల వెట్ ల్యాండ్ కార్యక్రమంలో వలస పక్షుల సంరక్షణ, నీటి వసతుల కల్పనకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు జోజి పేర్కొన్నారు. తూప్రాన్ రేంజ్ ఆఫీసర్ అంబర్ సింగ్, సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, ఓంప్రకాష్, చిరంజీవి పాల్గొన్నారు.