BDK: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు ఈనెల 23వ తేదీ నుంచి కొత్తగూడెం పట్టణంలో నిర్వహించనున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి.సాగర్లు తెలిపారు. రాష్ట్ర రైతు సంఘం మహాసభల పోస్టర్లను ఆవిష్కరించి వారు మాట్లాడారు. వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై, రైతాంగ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.