SRCL: హిందూ సమాజం సంఘటిత శక్తిగా ఎదగాలని సనాతన ధర్మ ప్రవచకులు పవన్ కుమార్ శర్మ అన్నారు. ఎల్లారెడ్డిపేట (M) బొప్పాపూర్లో నిర్వహించిన హిందూ విరాట్ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సనాతన హిందూ ధర్మం శ్రేష్టమైనదని, సమాజం పట్ల ప్రజలందరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.