SRD: జిన్నారం, సదాశివపేట, ఆందోలు కేజీబీవీ సీవోవో, జూనియర్ కళాశాలలో ప్రవేశ పరీక్ష కోసం బుధవారం వరకు దరఖాస్తు చేసుకోవాలని జీసీడీవో సునీత తెలిపారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు www.tgrjc.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మే 3న ప్రవేశపరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.