శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘భోగి’ షూటింగ్ వేగంగా సాగుతోంది. ప్రస్తుతం రంపచోడవరం అడవుల్లో దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. 1960ల నాటి రా రస్టిక్ డ్రామాలో శర్వా ఊర మాస్ లుక్లో కనిపించనుండగా.. అనుపమ, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది.