KNR: 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రామడుగు మండలం లక్ష్మిపూర్ గ్రామంలో మంగళవారం ఎస్సై రాజు ఆధ్వర్యంలో “రోడ్డు భద్రత”పై అరైవ్- అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఎస్సై రాజు రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. వాహనదారులు ప్రతిఒక్కరు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడరాదని అన్నారు.