BDK: రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్క వాహనదారుడు తమ భార్యా, పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఇంటి నుంచి బయటకు రావాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పాటు ఇతర ట్రాఫిక్ నియమాలను కూడా కచ్చితంగా పాటించాలని సూచించారు.