HYD: ఉప్పుగూడ డివిజన్ కృష్ణారెడ్డినగర్లో మంచినీటి పైప్లైన్ మరమ్మతుల కోసం తవ్విన గుంతలు కాలనీవాసులకు శాపంగా మారాయి. రెండు వారాలుగా పనులు నిలిచిపోవడంతో నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయాలని, ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆదుకోవాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.