AP: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్రానికి మద్దతుగా రాష్ట్ర మహిళా మంత్రులు, MLAలు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి ఉభయసభల్లో చర్చను తిలకించి, బిల్లు ఆమోదం పొందాక 18న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలపనున్నారు. CM చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.