AP: మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు గోపవరం ఎస్సీ కాలనీలో ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజలీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వడ్లూరు గ్రామం PACS వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక అధికారులు, కూటమి నేతలు పాల్గొననున్నారు.